TG 10th Supplementary Exams: రేపటి నుంచే తెలంగాణ టెన్త్ సప్లీ పరీక్షలు.. విద్యార్థులకు విద్యాశాఖ అలర్ట్!
TG 10th Supplementary Exams: తెలంగాణలో రేపటి (జూన్ 5) నుంచే 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
TG 10th Supplementary Exams: రేపటి నుంచే తెలంగాణ టెన్త్ సప్లీ పరీక్షలు.. విద్యార్థులకు విద్యాశాఖ అలర్ట్!
TG 10th Supplementary Exams: తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. రేపటి నుండి అంటే జూన్ 5వ తేదీ నుండి జూన్ 12వ తేదీ వరకు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు) పరీక్ష మాత్రం మధ్యాహ్నం 12:50 వరకు ఉంటుంది. అలాగే సైన్స్ పరీక్షలు (ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్) రెండు వేర్వేరు రోజుల్లో ఉదయం 9:30 నుండి 11:00 గంటల వరకు మాత్రమే జరుగుతాయి.ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 93 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొత్తం 31,542 మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకానున్నారు.
విద్యార్థులు తమ హాల్ టికెట్లను బోర్డు అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే నేరుగా తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని (Headmaster) కలిసి హాల్ టికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు. పరీక్ష రోజున ఎలాంటి టెన్షన్ పడకుండా ఉండేందుకు.. పరీక్ష కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
విద్యార్థులకు హాల్ టికెట్లలో లేదా పరీక్షలకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వాటి నివృత్తి కోసం హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో 24/7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే 040-23230942 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
10వ తరగతి సప్లీమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే..
జూన్ 5 (శుక్రవారం): ఫ్లస్ట్ ల్యాంగ్వేజ్ (గ్రూప్ ఏ)
జూన్ 6 (శనివారం): సెకెండ్ ల్యాంగ్వేజ్
జూన్ 7 (ఆదివారం): థర్డ్ ల్యాంగ్వేజ్ (ఇంగ్లీష్)
జూన్ 8 (సోమవారం): మ్యాథ్స్
జూన్ 9 (మంగళవారం): సైన్స్ పార్ట్ 1 (ఫిజిక్స్) — [ఉదయం 9:30 నుండి 11:00 వరకు మాత్రమే]
జూన్ 10 (బుధవారం): సైన్స్ పార్ట్ 2 (బయోలజీ) — [ఉదయం 9:30 నుండి 11:00 వరకు మాత్రమే]
జూన్ 11 (గురువారం): సోషల్ స్టడీస్, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1
జూన్ 12 (శుక్రవారం): ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2




