TG Polycet Results 2026: తెలంగాణ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ లింక్, పూర్తి వివరాలు ఇవే!

TG Polycet Results 2026: తెలంగాణ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి! మే 13న జరిగిన ప్రవేశ పరీక్ష రిజల్ట్స్ మరియు ర్యాంక్ కార్డులను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ polycet.sbtet.telangana.gov.in ద్వారా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి.

Arun Chilukuri
Published on: 23 May 2026 12:08 PM IST
TG Polycet Results 2026
X

TG Polycet Results 2026: తెలంగాణ పాలిసెట్ 2026 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్స్ డౌన్‌లోడ్ లింక్, పూర్తి వివరాలు ఇవే!

TG Polycet Results 2026: తెలంగాణలో డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ (పాలీటెక్నిక్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి (SBTET) 'టీజీ పాలిసెట్ - 2026' (TG POLYCET) ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. మే 13వ తేదీన జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవడంతో పాటు ర్యాంక్ కార్డులను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పాలిసెట్‌ పరీక్షలకు ఈసారి మొత్తం 98,029 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఫలితాలు మరియు ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:

అభ్యర్థులు కింద పేర్కొన్న సాధారణ స్టెప్స్ ఫాలో అయి తమ మార్కులు, ర్యాంకును తెలుసుకోవచ్చు:

స్టెప్ 1: ముందుగా అఫీషియల్ వెబ్‌సైట్ www.polycet.sbtet.telangana.gov.in ను ఓపెన్ చేయాలి.

స్టెప్ 2: హోమ్‌పేజీలో కనిపించే "TG POLYCET 2026 Results / Rank Card" లింక్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3: మీ హాల్‌టికెట్‌ నంబర్‌ (Hall Ticket Number) మరియు పుట్టిన తేదీ (Date of Birth) వివరాలను నమోదు చేయాలి.

స్టెప్ 4: వివరాలు ఎంటర్ చేశాక 'Submit' లేదా 'View Rank Card' బటన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 5: మీ ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. భవిష్యత్తులో కౌన్సెలింగ్ అవసరాల కోసం ఆ ర్యాంక్ కార్డును ప్రింట్ లేదా డౌన్‌లోడ్ చేసి భద్రపరుచుకోండి.

పాలిసెట్ ఫలితాల విడుదలైన నేపథ్యంలో, త్వరలోనే అర్హులైన అభ్యర్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం వెబ్ కౌన్సెలింగ్ (Web Counseling) షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story