TG Inter Supplementary Exams 2026: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

TG Inter Supplementary Exams 2026: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. మే 13 నుంచి 21 వరకు పరీక్షలు జరగనున్నాయి.

Arun Chilukuri
Published on: 13 April 2026 10:49 AM IST
TG Inter Supplementary Exams 2026
X

TG Inter Supplementary Exams 2026: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్: మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

TG Inter Supplementary Exams 2026: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించని వారు మరియు మార్కులు పెంచుకోవాలనుకునే (Improvement) విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 13 నుంచి మే 21 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు సెక్రెటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు.

ముఖ్యమైన తేదీలు & వివరాలు:

పరీక్షల కాలం: మే 13 నుంచి మే 21, 2026.

ఈ నెల 13 నుంచి 20 వరకు సంబంధిత కాలేజీల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రాక్టికల్స్: మే 22 నుంచి మే 25 వరకు.

ప్రత్యేక పరీక్షలు: మే 26న ఇంగ్లిష్ ప్రాక్టికల్స్, ఎథిక్స్ పరీక్ష.. మే 28న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష ఉంటుంది.

పరీక్షా సమయాలు:

ఫస్టియర్: ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు.

సెకండియర్: మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు.

సప్లిమెంటరీ టైమ్ టేబుల్ (మే 2026):

మే 13– సెకండ్ లాంగ్వేజ్

మే 14 – ఇంగ్లిష్‌

మే 15 – మ్యాథ్స్ ఏ, బోట‌నీ , పొలిటిక‌ల్ సైన్స్

మే 16– మ్యాథ్స్ బీ, జువాల‌జీ, హిస్టరీ

మే 18 – ఫిజిక్స్, ఎకనామిక్స్

మే 19 – కెమిస్ట్రీ, కామ‌ర్స్

మే 20 – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్ , బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్

మే 21 – మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story