TG Inter Admissions 2026: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ ప్రవేశాలు.. అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల!
TG Inter Admissions 2026: తెలంగాణలో ఇంటర్ అడ్మిషన్లు నేటి నుంచే ప్రారంభం. మే 31 వరకు దరఖాస్తుకు అవకాశం. పదో తరగతి జీపీఏ ఆధారంగానే సీట్ల కేటాయింపు.
TG Inter Admissions 2026: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ ప్రవేశాలు.. అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల!
Telangana Inter Admission Schedule 2026: తెలంగాణలో ఇంటర్మీడియట్ చదవాలనుకునే విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల షెడ్యూల్‌ను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి (BIE) అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచే (మే 12, 2026) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.
కీలక తేదీలు మరియు నిబంధనలు:
దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2026.
తరగతుల ప్రారంభం: జూన్ 1, 2026.
ఎంపిక విధానం: పదో తరగతి గ్రేడ్ పాయింట్ల (GPA) ఆధారంగా మాత్రమే ప్రవేశాలు కల్పించాలి. ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదు.
రిజర్వేషన్లు మరియు ప్రత్యేక ఆదేశాలు:
అడ్మిషన్ల ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్లు ఖచ్చితంగా పాటించాలని ప్రిన్సిపాళ్లను బోర్డు ఆదేశించింది.
ఎస్సీ (SC): 15% | ఎస్టీ (ST): 10% | బీసీ (BC): 29%
EWS: 10% రిజర్వేషన్లు కేటాయించారు.
బాలికలకు ప్రాధాన్యత: ప్రత్యేకంగా బాలికల కళాశాలలు లేని ప్రాంతాల్లో, సాధారణ కళాశాలల్లో 33.33% సీట్లను బాలికలకే కేటాయించాలి.
అడ్మిషన్ సమయంలో ఆధార్ నంబర్ తప్పనిసరి అని బోర్డు స్పష్టం చేసింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు వచ్చే వరకు ఆన్‌లైన్ మెమోల ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు కల్పించవచ్చని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.




