Telangana: ఇకపై విద్యార్థుల అకౌంట్లకే ఫీజు రీయింబర్స్‌మెంట్.. వారం రోజుల్లో కాలేజీలకి కట్టకపోతే రికవరీ!

Telangana: తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Published on: 10 Jun 2026 12:29 PM IST
Telangana
X

Telangana: ఇకపై విద్యార్థుల అకౌంట్లకే ఫీజు రీయింబర్స్‌మెంట్.. వారం రోజుల్లో కాలేజీలకి కట్టకపోతే రికవరీ!

Telangana: తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్థులకు వర్తించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fee Reimbursement) ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న పాత నిబంధనలను మారుస్తూ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటివరకు అమలులో ఉన్న జీవో 7 (GO 7) ను రద్దు చేస్తూ, కొత్త నిబంధనలతో కూడిన జీవో 8, 9 (GO 8, 9) లను అధికారికంగా జారీ చేసింది.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త గైడ్‌లైన్స్ రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త పాలసీ ప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త రూల్స్ ప్రవేశపెట్టింది.

ఇకపై ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఏడాదికి నాలుగు విడతలుగా విడుదల చేయనుంది. రీయింబర్స్‌మెంట్ నిధులు కాలేజీల యాజమాన్యాలకు కాకుండా, నేరుగా అర్హులైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. ప్రభుత్వం నుంచి విద్యార్థి ఖాతాలో డబ్బులు జమ అయిన వారం రోజుల్లో (7 రోజులు) సదరు విద్యార్థి ఆ ఫీజును తమ కాలేజీకి చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా (వారం రోజుల్లో) విద్యార్థులు కాలేజీలకు ఫీజు చెల్లించకపోతే, ఆ మొత్తాన్ని విద్యార్థుల నుండి ప్రభుత్వం తిరిగి రికవరీ చేస్తుంది.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కాలేజీల ఫీజుల చెల్లింపుల్లో జాప్యానికి అడ్డుకట్ట పడటంతో పాటు, విద్యార్థులకు జవాబుదారీతనం పెరుగుతుందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ కొత్త జీవోలపై విద్యార్థి సంఘాలు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల స్పందన ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story