SSB Jobs 2026: స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేల వరకు జీతం

SSB Jobs 2026: సహస్ర సీమా బాల్ (SSB) స్పోర్ట్స్ కోటా కింద భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ భద్రతా విభాగంలో మొత్తం 404 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు.

Mokshith
Published on: 11 May 2026 4:07 PM IST
SSB Jobs 2026
X

SSB Jobs 2026

SSB Jobs 2026: సహస్ర సీమా బాల్ (SSB) స్పోర్ట్స్ కోటా కింద భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఈ భద్రతా విభాగంలో మొత్తం 404 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏ పోస్టులకు నియామకాలు జరుగుతున్నాయి?

ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. పురుషులు, మహిళలు ఇద్దరికీ అవకాశం కల్పించారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా లేదా అవసరమైతే విదేశాల్లో కూడా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 404 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఏ క్రీడాకారులు అర్హులు?

పలు క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, షూటింగ్, వాలీబాల్, యోగాసన వంటి క్రీడా విభాగాలకు చెందిన వారు అర్హులు. అభ్యర్థులు దేశం లేదా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అలాగే నేషనల్ ఛాంపియన్‌షిప్‌లు లేదా ఖేలో ఇండియా గేమ్స్‌లో మెడల్స్ సాధించిన వారికి అవకాశం ఉంటుంది.

విద్యార్హత, వయస్సు వివరాలు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా దానికి సమానమైన అర్హత పూర్తిచేసి ఉండాలి. 18 నుంచి 23 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంత జీతం లభిస్తుంది?

ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ పే మ్యాట్రిక్స్ లెవల్-3 ప్రకారం వేతనం చెల్లిస్తారు. నెల జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. ఇతర ప్రభుత్వ భత్యాలు కూడా వర్తిస్తాయి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రారంభం – 09 మే 2026న మొద‌ల‌వుతుండ‌గా.. 07 జూన్ 2026ని చివరి తేదీగా నిర్ణ‌యించారు. జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్య‌ర్థులు రూ.100, ఎస్సీ / ఎస్టీ / మహిళలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన ప‌నిలేదు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story