NEET UG 2026: నీట్ యూజీ 2026 విద్యార్థులకు అలర్ట్: ఫీజు రీఫండ్ లింక్ ఓపెన్.. మే 27 లోగా అప్లై చేసుకోండి!
NEET UG 2026: రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్ష ఫీజు వాపసు (Refund) ప్రక్రియను ఎన్‌టీఏ (NTA) ప్రారంభించింది.
NEET UG 2026: నీట్ యూజీ 2026 విద్యార్థులకు అలర్ట్: ఫీజు రీఫండ్ లింక్ ఓపెన్.. మే 27 లోగా అప్లై చేసుకోండి!
NEET UG 2026: రద్దయిన నీట్ యూజీ (NEET UG) 2026 పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. పరీక్ష ఫీజును విద్యార్థులకు తిరిగి ఇచ్చేందుకు (Refund) ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ పోర్టల్‌ను ఎన్‌టీఏ అందుబాటులోకి తెచ్చింది. పరీక్ష ఫీజు చెల్లించిన అర్హులైన అభ్యర్థులందరూ తమ బ్యాంక్ ఖాతా వివరాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమర్పించి రీఫండ్ పొందవచ్చని తెలిపింది.
ఈ ఫీజు వాపసు ప్రక్రియ ఈ నెల (మే) 22న ప్రారంభం కాగా, మే 27వ తేదీ లోపు వివరాల నమోదును పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
బ్యాంక్ వివరాలు సమర్పించే విధానం (Step-by-Step Process):
రీఫండ్ డబ్బులు నేరుగా విద్యార్థుల ఖాతాకే బదిలీ అవుతాయి. కాబట్టి కింద పేర్కొన్న పద్ధతిలో ఆన్‌లైన్ ఫారమ్‌ను నింపాలి:
స్టెప్ 1: ముందుగా అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి.
స్టెప్ 2: హోమ్‌పేజీలో ఉన్న "NEET 2026 Refund Portal" లింక్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ (DOB) వివరాలతో లాగిన్ అవ్వాలి.
స్టెప్ 4: అనంతరం మీ బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్‌సీ (IFSC) కోడ్, బ్యాంక్ పేరును జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.
స్టెప్ 5: అవసరమైతే మీ పేరు స్పష్టంగా ఉన్న రద్దు చేసిన చెక్కు (Cancelled Cheque) కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 6: వివరాలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో సరిచూసుకుని ఫారమ్‌ను 'సబ్‌మిట్' చేయాలి.
స్టెప్ 7: ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం 'కన్ఫర్మేషన్ పేజీ'ని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
ప్రస్తుతం ఒకేసారి లక్షలాది మంది విద్యార్థులు ఈ పోర్టల్‌ను ఓపెన్ చేస్తుండటంతో సర్వర్‌పై భారీ లోడ్ పడి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. లాగిన్ ఎర్రర్స్ రావడం, ఓటీపీ (OTP) ఆలస్యం కావడం, సర్వర్ డౌన్ అవ్వడం వంటి సమస్యలపై ఎన్‌టీఏ స్పందించింది.
NTA అలర్ట్: విద్యార్థులు అప్‌డేట్ చేసిన బ్రౌజర్లను ఉపయోగించాలని, రద్దీ తక్కువగా ఉండే రాత్రి లేదా తెల్లవారుజాము సమయాల్లో ప్రయత్నించాలని సూచించింది. అలాగే, నకిలీ రీఫండ్ లింకులు, ఫేక్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారిక వెబ్‌సైట్ ద్వారానే వివరాలు నమోదు చేయాలని హెచ్చరించింది.
జూన్ 21న ‘నీట్’ రీ-ఎగ్జామ్:
రద్దయిన నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్షను తిరిగి జూన్ 21న (రీ-ఎగ్జామినేషన్) నిర్వహించనున్నట్లు అధికారులు రీ-షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి ఎలాంటి పొరపాట్లు, పేపర్ లీకేజీలు జరగకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌టీఏ గట్టి హామీ ఇచ్చింది.




