JEE Main 2026 Session 2 Results: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల కౌంట్‌డౌన్ షురూ..!

JEE Main 2026 Session 2 Results: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ విడుదల చేసింది. ఏప్రిల్ 11న ఆన్సర్ కీ, ఏప్రిల్ 20న తుది ఫలితాలు విడుదల కానున్నాయి.

Arun Chilukuri
Published on: 9 April 2026 4:12 PM IST
JEE Main 2026 Session 2 Results
X

JEE Main 2026 Session 2 Results: జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల కౌంట్‌డౌన్ షురూ..!

JEE Main 2026 Session 2 Results: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 ఫలితాలకు రంగం సిద్ధమైంది. పరీక్షలు ముగిసిన వెంటనే జాతీయ పరీక్షల సంస్థ (NTA) కీలక షెడ్యూల్‌ను ప్రకటించింది. పారదర్శకత కోసం విద్యార్థులు రాసిన క్వశ్చన్ పేపర్లను పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

ముఖ్యమైన తేదీలు ఇవే:

ఏప్రిల్ 9: జేఈఈ మెయిన్ క్వశ్చన్ పేపర్ల విడుదల.

ఏప్రిల్ 11: ప్రొవిజినల్ ఆన్సర్ కీ మరియు విద్యార్థుల రెస్పాన్స్ షీట్ల విడుదల.

ఏప్రిల్ 20: జేఈఈ మెయిన్ సెషన్-2 తుది ఫలితాలు మరియు ఫైనల్ ర్యాంకుల వెల్లడి.

పరీక్షకు హాజరైన గణాంకాలు:

ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షలకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది.

ఏప్రిల్ 2 నుంచి 8వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు మొత్తం 11.23 లక్షల మంది (సుమారు 93%) విద్యార్థులు హాజరయ్యారు.

పేపర్-1 (B.E/B.Tech): దేశీయంగా 11.06 లక్షల మంది, విదేశాల్లో 4,229 మంది విద్యార్థులు రాశారు.

పేపర్-2 (B.Arch/B.Planning): 54,953 మంది విద్యార్థులు హాజరయ్యారు.

అభ్యంతరాల స్వీకరణ:

ఏప్రిల్ 11న విడుదలయ్యే ప్రొవిజినల్ ఆన్సర్ కీపై విద్యార్థులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేయవచ్చు. ప్రతి ప్రశ్నకు రూ. 200 చొప్పున ఫీజు చెల్లించి ఛాలెంజ్ చేసే అవకాశం కల్పించారు. నిపుణుల కమిటీ ఈ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది ఫలితాలను వెల్లడిస్తారు.

ర్యాంకుల కేటాయింపు:

జేఈఈ మెయిన్ సెషన్-1 మరియు సెషన్-2 రెండింటిలోనూ విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరు (Best of two) ఆధారంగా ఫైనల్ ర్యాంకులను ఎన్‌టీఏ ప్రకటించనుంది.

ఫలితాలు ఎక్కడ చూసుకోవాలి?

అభ్యర్థులు తమ ఫలితాలను కింది అధికారిక వెబ్‌సైట్లలో తనిఖీ చేయవచ్చు:

jeemain.nta.nic.in

nta.ac.in

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story