Indian Navy SSC: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. నెలకు 50 వేలకుపైగా జీతం

Indian Navy SSC: ఇండియన్ నేవీ మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నిర్వహించే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది.

Mokshith
Published on: 13 May 2026 4:42 PM IST
Indian Navy SSC
X

Indian Navy SSC: ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. నెలకు 50 వేలకుపైగా జీతం

Indian Navy SSC: ఇండియన్ నేవీ మంచి అవకాశాన్ని తీసుకొచ్చింది. కేరళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నిర్వహించే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సు కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. అవివాహిత పురుషులు, మహిళలు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏ పోస్టులకు నియామకాలు.. ఎవరికి అవకాశం?

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగానికి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కంప్యూటర్, ఐటీ రంగంలో చదివిన అభ్యర్థులకు ఇది మంచి కెరీర్ అవకాశంగా భావిస్తున్నారు. దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

అలాగే బీసీఏ, బీఎస్సీ, ఎంసీఏ వంటి కోర్సుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత అవసరం. మరోవైపు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ వంటి విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ లేదా ఎంటెక్ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు.

వయోపరిమితి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2002 జనవరి 1 నుంచి 2007 జులై 1 మధ్య జన్మించి ఉండాలి. అభ్యర్థుల విద్యార్హతల ఆధారంగా మొదట షార్ట్‌లిస్టింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షల ద్వారా తుది ఎంపిక చేపడతారు. ఈ నియామకాల్లో ప్రత్యేక విషయం ఏమిటంటే ఎలాంటి రాత పరీక్ష ఉండదు. దీంతో అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఎంపిక అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికెట్ లేదా కనీసం ‘బీ’ గ్రేడ్ ఉన్న వారికి అదనంగా 5 శాతం వెయిటేజ్ ఇవ్వనున్నారు.

ఎంపికైన వారికి జీతం, శిక్షణ వివరాలు

ఈ పోస్టుల్లో ఎంపికైన వారికి ప్రారంభ వేతనంగా నెలకు రూ.56,100తో పాటు ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీలో ఆరు వారాల ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

శిక్షణ కాలంలో అభ్యర్థులు వివాహం చేసుకోవడానికి అనుమతి ఉండదు. నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్షణ నుంచి తొలగించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి మొదట 10 సంవత్సరాల సేవా కాలం ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో నాలుగు సంవత్సరాలు పొడిగించే అవకాశం కూడా నేవీ కల్పిస్తోంది.

దరఖాస్తు తేదీలు ఇవే

ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 మే 16 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 జూన్ 1లోపు దరఖాస్తు పూర్తి చేయాలి. ఇండియన్ నేవీలో ఉద్యోగం చేయాలనుకునే టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న యువతకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story