Job Reject: రూ.32 లక్షల జాబ్‌కు గుడ్‌బై.. కారణం ఏం చెప్పిందో తెలుస్తే మైండ్ పోయిద్ది!

Job Reject: అధిక జీతం ఇచ్చే గురుగ్రామ్ ఉద్యోగ ఆఫర్‌ను తిరస్కరించి, మానసిక ప్రశాంతత కోసం బెంగళూరులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న ఒక ఐఐటీ.

Naresh.k
Published on: 4 July 2026 1:09 PM IST
Job Reject
X

Job Reject: రూ.32 లక్షల జాబ్‌కు గుడ్‌బై.. కారణం ఏం చెప్పిందో తెలుస్తే మైండ్ పోయిద్ది!

Roorkee Alumna: మంచి ప్యాకేజీతో పెద్ద ఉద్యోగం వస్తే చాలు.. ఏ నగరానికైనా మారడానికి ఈ రోజుల్లో ఎవరైనా రెడీ అయిపోతారు. కానీ, ఒక ఐఐటీ విద్యార్థిని మాత్రం కోట్లు ఇచ్చే ఉద్యోగం కంటే తన మనశ్శాంతి, భద్రతే ముఖ్యమని భావించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలోని గురుగ్రామ్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న ఆమె.. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుంది. భారీ జీతం ఇచ్చే కెరీర్‌ను వదులుకుని, తను ఎంతో ప్రేమించే బెంగళూరు నగరంలోనే ఉండిపోవాలని ఫిక్స్ అయింది.

తాను గురుగ్రామ్‌కు మారాలనే నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకుందో వివరిస్తూ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నేను ఈ రోజు గురుగ్రామ్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించి, బెంగళూరుకు వీడ్కోలు చెప్పాల్సి ఉంది. కానీ నేను ఆ పని చేయడం లేదు. ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. నా మనసులోని సందేహాలన్నింటికీ బెంగళూరు ఆకాశంలో కనిపించిన జంట ఇంద్రధనుస్సు సమాధానం చెప్పింది అని రాసుకొచ్చింది. తన నిర్ణయాన్ని ఆమె ఒకే ఒక్క వాక్యంలో అద్భుతంగా వివరించింది.. కొన్నిసార్లు అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగమే ఉత్తమ కెరీర్‌ను నిర్ణయించదు. నేను డబ్బు కంటే మానసిక ప్రశాంతతను ఎంచుకున్నాను.

ఆమె తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయంలో మహిళల భద్రత అనే అంశం అత్యంత ప్రధాన పాత్ర పోషించింది. ఐఐటీ రూర్కీలో చదువుతున్న సమయంలో ఆమె ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి పలు సందర్భాల్లో ప్రయాణాలు చేసింది. అయితే ఆ సమయంలో తనకు కొన్ని చేదు, అసౌకర్యకరమైన అనుభవాలు ఎదురయ్యాయని ఆమె పేర్కొంది. ఆ భయాలే తనను గురుగ్రామ్ వైపు వెళ్లకుండా వెనుకంజ వేయించాయి.

అదే సమయంలో బెంగళూరు నగరం తనకు ఇచ్చిన భద్రతాభావం, ఆప్యాయత, స్నేహపూర్వక వాతావరణాన్ని ఆమె మనస్ఫూర్తిగా ప్రశంసించింది. ఢిల్లీతో పోలిస్తే బెంగళూరు తనకు ఎంతో సౌకర్యంగా, సురక్షితంగా, సొంత ఇల్లు లాంటి అనుభూతిని ఇచ్చిందని భావించింది.

డబ్బు, కెరీర్ రేసులో పడి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఫణంగా పెడుతున్న నేటి తరం కార్పొరేట్ ఉద్యోగులకు ఈ యువతి నిర్ణయం ఒక కనువిప్పులా నిలిచింది. నువ్వు తీసుకున్న నిర్ణయం వంద శాతం కరెక్ట్.. ఢిల్లీ కంటే బెంగళూరు వాతావరణం, అక్కడి ప్రజల మనస్తత్వం చాలా బెటర్, భద్రత, ప్రశాంతత కంటే ఏదీ ఎక్కువ కాదు అంటూ నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం బెంగళూరు అందమైన ఆకాశం వీడియోతో కూడిన ఆమె ఇన్‌స్టా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story