CCMB Recruitment: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ప్ర‌భుత్వ ఉద్యోగం.. ఎలా ఎంపిక చేస్తారంటే

CCMB Recruitment: ముఖ పరిశోధనా సంస్థ CSIR – సెంట‌ర్ ఫ‌ర్ స‌ల్యూలార్ అండ్ మాలిక్యూల‌ర్ బ‌యాల‌జీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

Mokshith
Published on: 10 May 2026 1:45 PM IST
CCMB Recruitment
X

CCMB Recruitment: ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో ప్ర‌భుత్వ ఉద్యోగం.. ఎలా ఎంపిక చేస్తారంటే

CCMB Recruitment: ముఖ పరిశోధనా సంస్థ CSIR – సెంట‌ర్ ఫ‌ర్ స‌ల్యూలార్ అండ్ మాలిక్యూల‌ర్ బ‌యాల‌జీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి లేదా ఐటీఐ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.?

సీసీఎంబీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 22 టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. ఒక డ్రైవ‌ర్ పోస్టు ఉంది. వివిధ విభాగాల్లో సాంకేతిక పనులు నిర్వహించేందుకు టెక్నీషియన్‌లను నియమించనున్నారు. అలాగే సంస్థకు అవసరమైన వాహన సేవల కోసం డ్రైవర్ పోస్టును భర్తీ చేస్తారు.

అర్హతలు ఏంటి?

టెక్నీషియన్ పోస్టులకు కనీసం 55 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ అవసరం. ల్యాబొరేటరీ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఫుడ్ ప్రొడక్షన్ వంటి ట్రేడ్లు అర్హతలో భాగం. లేదా 10వ తరగతి పూర్తి చేసి సంబంధిత విభాగంలో రెండేళ్ల అప్రెంటిస్ అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

డ్రైవర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు 10వ తరగతి పాస్ అయి ఉండాలి. లైట్, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. కనీసం మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం అవసరం. వాహనాల మెకానికల్ పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

టెక్నీషియన్ పోస్టుల ఎంపికను రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారినే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రెండో దశలో రాత పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ సంబంధిత సబ్జెక్ట్ ప్రశ్నలు ఉంటాయి. కొన్ని పేపర్లలో నెగటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. తుది ఎంపిక రాత పరీక్ష మార్కుల ఆధారంగా జరుగుతుంది.

డ్రైవర్ పోస్టుకు ముందుగా స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంశాలపై ప్రశ్నలు వస్తాయి.

వయస్సు, ఫీజు వివరాలు

టెక్నీషియన్ పోస్టులకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలుగా నిర్ణ‌యించారు. డ్రైవర్ పోస్టుకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు.. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మిన‌హాయింపు ఉంటుంది. దివ్యాంగులకు అదనపు సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు విష‌యానికొస్తే.. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు

అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేయాలి. అనంతరం అప్లికేషన్ ప్రింట్ తీసుకుని అవసరమైన సర్టిఫికెట్లతో పోస్టు ద్వారా పంపాలి. పోస్టును సెక్షన్ ఆఫీసర్, CSIR – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ – 500007 అడ్ర‌స్‌కు పంపించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు 26 మే 2026ని, హార్డ్ కాపీ స‌మ‌ర్ఫ‌ణ‌కు 05 జూన్ 2026ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story