CBSE 10th Result 2026: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలకు ముహూర్తం ఖరారు.. వచ్చే వారమే రిజల్ట్స్!

CBSE 10th Result 2026: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు వచ్చే వారం విడుదలయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 25 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు

Arun Chilukuri
Published on: 11 April 2026 12:26 PM IST
CBSE 10th Result 2026
X

CBSE 10th Result 2026: సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలకు ముహూర్తం ఖరారు.. వచ్చే వారమే రిజల్ట్స్!

CBSE 10th Result 2026: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పదో తరగతి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు కీలక సమాచారం. వచ్చే వారంలోనే ఈ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని బోర్డు వర్గాల సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమైన పరీక్షలు మార్చి 11వ తేదీతో ముగిశాయి.

రెండు సెషన్లలో పరీక్షలు:

ఈసారి సీబీఎస్‌ఈ వినూత్నంగా రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించింది. మొదటి సెషన్ అందరికీ తప్పనిసరి చేయగా, తమ మార్కులను లేదా పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరుచుకోవాలనుకునే విద్యార్థుల కోసం రెండో సెషన్‌ను కూడా నిర్వహించారు. దేశవ్యాప్తంగా 8 వేలకు పైగా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు సుమారు 25 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి మరియు ఇంటర్ (12వ తరగతి) కలిపి మొత్తం 43 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.

ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?

అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే కాకుండా విద్యార్థుల సౌకర్యార్థం పలు యాప్‌ల ద్వారా కూడా ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.

వెబ్‌సైట్లు: cbse.gov.in, results.nic.in

యాప్స్: డిజీ లాకర్ (DigiLocker), ఉమాంగ్ (UMANG) యాప్.

ఇతర మార్గాలు: SMS లేదా IVRS సర్వీస్ ద్వారా కూడా రిజల్ట్స్ పొందవచ్చు.

కావాల్సిన వివరాలు: రోల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐడీ మరియు పుట్టిన తేదీ.

దక్షిణాది రాష్ట్రాల జోరు:

గత కొన్నేళ్లుగా సీబీఎస్‌ఈ ఫలితాల్లో దక్షిణాది రాష్ట్రాలు టాప్ ప్లేస్‌లో నిలుస్తున్నాయి. తిరువనంతపురం వరుసగా టాపర్స్‌ను అందిస్తుండగా, ఆ తర్వాత స్థానాల్లో చెన్నై, విజయవాడ, బెంగళూరు నిలుస్తున్నాయి. 2024లో విజయవాడ రీజియన్ రెండో స్థానాన్ని దక్కించుకోగా.. 2025లో 12వ తరగతి ఫలితాల్లో తెలంగాణ (99.73%), ఆంధ్రప్రదేశ్ (99.51%) అత్యుత్తమ ఉత్తీర్ణత శాతం నమోదు చేశాయి. ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటుతారని విద్యాశాఖ నిపుణులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story