APPSC Group 1 Notification 2026: ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. ఏయే విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే?

APPSC Group 1 Notification 2026: ఏపీలో 163 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. అక్టోబర్ 6 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ.

Arun Chilukuri
Published on: 15 Sept 2026 11:15 AM IST
APPSC Group 1 Notification 2026:
X

APPSC Group 1 Notification 2026: ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. ఏయే విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే?

APPSC Group 1 Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో వివిధ విభాగాలకు చెందిన మొత్తం 163 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 27 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని స్పష్టం చేసింది.

భర్తీ చేయనున్న వాటిలో డిప్యూటీ కలెక్టర్లు 11, ట్యాక్స్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ కమిషనర్లు 14, డీఎస్పీ సివిల్‌ 36, డీఎస్పీ కమ్యూనికేషన్స్‌ 3, డీఈవోలు 14, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు 1, ఆర్టీవోలు 3, డిప్యూటీ రిజిస్టర్‌ కోఆపరేటివ్‌ సర్వీసెస్‌ 15, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 12, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ 2, డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 14, డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ 35 పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం మరియు ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు APPSC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.