AP SSC Results 2026: రేపే ఏపీ పదో తరగతి ఫలితాలు.. వాట్సాప్, వెబ్‌సైట్లలో చూసే విధానం ఇదే!

AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. మన మిత్ర వాట్సాప్, LEAP యాప్ మరియు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలు చూసుకునే విధానాన్ని మంత్రి నారా లోకేశ్ వివరించారు.

Arun Chilukuri
Published on: 29 April 2026 12:28 PM IST
AP SSC Results 2026
X

AP SSC Results 2026: రేపే ఏపీ పదో తరగతి ఫలితాలు.. వాట్సాప్, వెబ్‌సైట్లలో చూసే విధానం ఇదే!

AP SSC Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. 2026 ఎస్‌ఎస్‌సీ పబ్లిక్ పరీక్షల ఫలితాలను రేపు (ఏప్రిల్ 30, గురువారం) ఉదయం 11:00 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఫలితాలను తెలుసుకునే మార్గాలు ఇవే:

విద్యార్థులు తమ ఫలితాలను పలు మార్గాల్లో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. SSC ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూడవచ్చు. అలాగే మన మిత్ర వాట్సాప్ సేవలో 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చు. అదనంగా LEAP మొబైల్ యాప్ ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. డిజిలాకర్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో కూడా మార్కుల మెమోలు అందుబాటులో ఉండనున్నాయి అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్‌.

నిరుత్సాహపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి!

ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి లోకేశ్ విద్యార్థులకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. పరీక్షల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలుపుతూనే, ఆశించిన ఫలితాలు రాని విద్యార్థులకు ధైర్యం చెప్పారు. "పదో తరగతి ఫలితాలు జీవిత ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమే. మార్కులు తక్కువ వచ్చాయని ఎవరూ నిరుత్సాహపడొద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి" అని ఆయన సూచించారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story