AP Inter Supply Results 2026: విద్యార్థులకు అలర్ట్.. రేపే ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
AP Inter Supply Results 2026: ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది.
AP Inter Supply Results 2026: విద్యార్థులకు అలర్ట్.. రేపే ఏపీ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు..
AP Inter Supply Results 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు అలర్ట్! ప్రథమ (1st Year), ద్వితీయ (2nd Year) ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి (BIEAP) రంగం సిద్ధం చేసింది. రేపు అంటే జూన్ 18 (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫలితాలను బోర్డు అధికారులు అధికారికంగా విడుదల చేయనున్నారు.
ఈ ఏడాది ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దాదాపు 12.50 లక్షల జవాబు పత్రాల (ఆన్సర్ షీట్స్) మూల్యాంకన ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసి, ఫలితాల ప్రకటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో కింది అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను ఉచితంగా చూసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: https://bie.ap.gov.in/
ఫలితాల ప్రకటన అనంతరం రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ లేదా మార్కుల మెమోలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంటర్ బోర్డు అధికారులు ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నారు.




