AP Education Fee Hike: ఏపీలో విద్యార్థులకు అలెర్ట్.. బీటెక్, డిగ్రీ ఫీజులు 10 శాతం పెరిగే అవకాశం!

AP Higher Education:Mఆంధ్రప్రదేశ్‌లో బీటెక్, డిగ్రీ కోర్సుల ఫీజుల ఖరారుపై ఉన్నత విద్యాశాఖ కీలక ప్రతిపాదన సిద్ధం చేసింది.

Arun Chilukuri
Published on: 3 July 2026 10:53 AM IST
AP Education Fee Hike
X

AP Education Fee Hike: ఏపీలో విద్యార్థులకు అలెర్ట్.. బీటెక్, డిగ్రీ ఫీజులు 10 శాతం పెరిగే అవకాశం!

AP Education Fee Hike: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ప్రైవేట్ ప్రొఫెషనల్, డిగ్రీ కాలేజీల ఫీజుల నియంత్రణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఫీజుల నియంత్రణ కమిటీ (APAFRC) చైర్‌పర్సన్ నియామకం వాయిదా పడుతూ వస్తుండటంతో, కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల ఖరారు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్ (B.Tech)తో పాటు ఇతర డిగ్రీ కోర్సుల అడ్మిషన్ల ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు.. ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజులకే తాత్కాలికంగా 10 శాతం పెంపు వర్తింపజేసి కౌన్సెలింగ్ ప్రారంభించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఉన్నత విద్యా కోర్సుల ఫీజులను అధికారికంగా సవరించే (ఫీజుల పునఃసమీక్ష) విధానం అమల్లో ఉంది. గడువు ముగియడంతో ఈ ఏడాది కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఫీజుల నియంత్రణ కమిటీ చైర్‌పర్సన్ నియామకం ఆలస్యం కావడంతో కాలేజీల వారీగా ఫీజుల లెక్కింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. దీనివల్ల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ఆలస్యమవుతుండటంతో ఉన్నత విద్యాశాఖ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది.

"ఫీజుల నియంత్రణ కమిటీ ద్వారా కొత్త ఫీజుల పూర్తి స్థాయి ఖరారుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. దీనివల్ల విద్యార్థుల అడ్మిషన్ల ప్రక్రియ మరింత ఆలస్యమైతే విద్యా సంవత్సరం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, విద్యార్థులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు గత మూడేళ్లుగా అమల్లో ఉన్న పాత ఫీజులకే అదనంగా 10 శాతం పెంపును జోడించి, దానిని తాత్కాలిక ఫీజుగా నిర్ణయించే అవకాశాలను పరిశీలిస్తున్నాం." అని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

ఈ తాత్కాలిక ఫీజుల పెంపు ప్రతిపాదనకు సంబంధించిన ఫైల్‌ను ఉన్నత విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనకు పంపినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (GO) జారీ చేయనుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఏపీలో బీటెక్, డిగ్రీ, పీజీ ప్రొఫెషనల్ కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ వేగవంతం కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story