AP ECET 2026 Results: ఏపీ ఈసెట్‌ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

AP ECET 2026 Results: ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు. మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. 32 వేల మందికి పైగా విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

Arun Chilukuri
Published on: 7 May 2026 4:31 PM IST
AP ECET 2026 Results
X

AP ECET 2026 Results: ఏపీ ఈసెట్‌ ఫలితాల విడుదలకు సర్వం సిద్ధం.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే?

AP ECET 2026 Results: పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసి, ఇంజినీరింగ్ (B.Tech) ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఏపీ ఈసెట్-2026 ఫలితాల విడుదలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఈసెట్ కన్వీనర్ దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫలితాలను గురువారం (నేడు) సాయంత్రం లేదా శుక్రవారం ఉదయం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఫలితాలతో పాటు టాపర్ల వివరాలను ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ మరియు ఈసెట్ కన్వీనర్ సంయుక్తంగా ప్రకటించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 23న జరిగిన ఈ పరీక్షకు దాదాపు 32,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన కొద్ది రోజుల్లోనే ప్రాథమిక కీ (Answer Key) విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు, ఇప్పుడు తుది ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా సీట్లు కేటాయిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story