Tanuku: తణుకు పైడిపర్రు వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడు అక్కడికక్కడే మృతి!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు వద్ద లారీ ఢీకొని తోరంగి కిరణ్ (32) అనే యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గ్రామీణ పోలీసులు.
Tanuku: తణుకు పైడిపర్రు వద్ద రోడ్డు ప్రమాదం: యువకుడు అక్కడికక్కడే మృతి!
తణుకు: తణుకు మండలం పైడిపర్రు సమీపంలో లారీ ఢికొని బుధవారం ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన తోరంగి కిరణ్ (32) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు పోలీసులు కథనం మేరకు.. కిరణ్ తణుకు వై జంక్షన్ వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ లో కాంట్రాక్ట్ షిప్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.
కిరణ్ కు కోరుకొల్లు గ్రామానికి చెందిన ఈశ్వరితో ఏడాది క్రితం వివాహమైంది. ఈశ్వరి పుట్టింటికి వెళ్లడంతో బుధవారం పని ముగించుకుని కిరణ్ అతని భార్య వద్దకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.
మార్గం మధ్యలో పైడిపర్రు వద్ద క్వారీ లారీ ఢీకొటింది. దీంతో తలకు తీవ్రగాయం కావడంతో కిరణ్ సంఘటన ప్రాంతంలో అక్కడికక్కడే చెందాడు. గ్రామీణ పోలీసులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




