Secunderabad: పటాన్‌చెరువు వద్ద రసూల్‌పురా వాసి రాజశేఖర్ దారుణ హత్య!
Secunderabad: పటాన్‌చెరువు వద్ద క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ దారుణ హత్య. మారేడుపల్లిలో డ్రాపింగ్ తర్వాత ఘటన, విచారణ జరిపి నిందితులను పట్టుకోవాలని కుటుంబసభ్యుల డిమాండ్.
Secunderabad: పటాన్‌చెరువు వద్ద రసూల్‌పురా వాసి రాజశేఖర్ దారుణ హత్య!
Secunderabad: సికింద్రాబాద్ పటాన్చెరువు వద్ద హత్యకు గురైన రాజశేఖర్ చాలా మంచివాడు అని ఇటువంటి త్రాగుడు అలవాటు కూడా లేదని బస్తి వాసులు తెలిపారు. రాత్రి సమయంలో ఎక్కువగా డ్యూటీలు చేసేవాడని, మారేడు పల్లిలో డ్రాపింగ్ అనంతరం, ఇంట్లో వారు కూడా టచ్ లో లేడని వెంటనే అనుమానం కలిగి బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామంటు వారి కుటుంబంలో తెలిపారు.
అయితే రాత్రి సమయంలో కారులో శవమై ఉన్నాడు అంటూ పోలీసులు సమాచారం ఇచ్చారని అసలు మారేడిపల్లిలో డ్రాపింగ్ అనంతరం ఏదో జరిగి ఉంటుందని, పోలీసులు విచారణ జరిపి నేరస్తులను పట్టుకోలంటూ వారి బంధువులు కోరారు కంటోన్మెంట్ రసూల్పురాలు రాజశేఖర్ మృతితో వారి నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.




