Sattupalli: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి!
Sattupalli: సత్తుపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం. కారు అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.
Sattupalli: గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఘోర ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి!
Sattupalli: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రైలింగ్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు మరో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు అవ్వటంతో హైవే అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు అయితే ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది.ఘటన స్థలానికి చేరుకున్న వీ.ఎం.బంజర్ పోలీసులు ప్రమాదం జరిగిన విదానాన్ని పరిశీలించారు. మృతులు కొల్లి ఉషారాణి చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి వాసిగా,డ్రైవర్ నాగవరపు నాగేశ్వరరావు ఖమ్మం వాసిగా పోలీసులు గుర్తించారు.క్షతగాత్రులు సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన సీతామహలక్ష్మీ,శేషుకుమారి,రాజేశ్వరిలు గా గుర్తించారు.




