Prathipadu: టి.రాయవరంలో దారుణం.. చేపల చెరువు లీజుదారుడి హత్య, బీరువా ధ్వంసం!

Prathipadu: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం టి.రాయవరంలో చేపల చెరువు లీజుదారుడు మోరీ నరసింహమూర్తి దారుణ హత్య. రంగంలోకి క్లూస్ టీమ్, కేసు నమోదు చేసిన పోలీసులు.

AYYAPPA SWAMI, PRATTIPADU
Published on: 12 Sept 2026 2:10 PM IST
Prathipadu
X

Prathipadu: టి.రాయవరంలో దారుణం.. చేపల చెరువు లీజుదారుడి హత్య, బీరువా ధ్వంసం!

Prathipadu: కాకినాడజిల్లా ప్రత్తిపాడు మండలం టి రాయవరం నల్ల చెరువు గట్టున చేపల చెఱువు లీజు దారుడు మోరీ నరసింహమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా పైల చింతపాడు గ్రామానికి చేందిన మృతుడు మోరీ నరసింహమూర్తి

టి.రాయవరం గ్రామానికి చెందిన తటవర్తి మెహర్ ప్రసాద్ కు చెందిన చెరువులు లీజుకు తీసుకొని చేపలు పంట సాగు చేపడుతున్నారు. మృతుడికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, కూతురు బర్త మరణించడంతో తండ్రి కూతురు ఒకే చోట ఉంటూ చెరువులు సాగు చేపడుతున్నారు.

విడో పెన్షన్ కోసం కూతురు గత రెండు రోజులక్రితం కృష్ణా జిల్లా కొవ్వలంక వెళ్ళినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రత్తిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దుండగులు బీరువా పగులగొట్టిన ఆనవాలు నేపద్యంలో సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్. డాగ్ స్క్వాడ్ చేరుకున్నాయి. ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేపడుతున్నారు.

AYYAPPA SWAMI, PRATTIPADU

AYYAPPA SWAMI, PRATTIPADU