Avanigadda: అవనిగడ్డలో వివాహిత అనుమానాస్పద మృతి కేసు నమోదు!

Avanigadda: అవనిగడ్డ నియోజకవర్గంలో వివాహిత నాగరమ్య అనుమానాస్పద మృతి. ప్రియుడి ఇంట్లో శవమై తేలడంతో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Updated on: 9 Sept 2026 2:31 PM IST
Avanigadda
X

Avanigadda: అవనిగడ్డలో వివాహిత అనుమానాస్పద మృతి కేసు నమోదు!

Avanigadda: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వివాహిత మృతి ఘటన కలకలం రేపింది. కోడూరు మండలం మందపాకల గ్రామానికి చెందిన బెల్లంకొండ నాగరమ్య (33) అద్దంకి నాగరాజు నివాసం వద్ద ఉరివేసుకున్న స్థితిలో మృతి చెందినట్లు సమాచారం.

మృతురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగరమ్య మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఆమె భర్త బెల్లంకొండ నాగ మల్లేశ్వరరావు, తన భార్య మృతికి అద్దంకి నాగరాజే కారణమని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ కె. చాణిక్య తెలిపారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో వెలువడే వివరాల ఆధారంగా మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story