Annamayya: అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య చౌడేపల్లిలో విషాదం!

Annamayya: అన్నమయ్య జిల్లా చౌడేపల్లికి చెందిన గంగాధర్ అనారోగ్య కారణాల వల్ల మనస్తాపం చెంది చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

MAHESH, PUNGANOOR
Published on: 29 July 2026 11:42 AM IST
Annamayya
X

Annamayya: అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య చౌడేపల్లిలో విషాదం!

Annamayya: అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి కి చెందిన వడిగల వెంకట్రమణ కుమారుడు గంగాధర్ (45) చిన్నయల్లకుంట్ల సమీపంలో చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడి బంధువుల కథనం ప్రకారం మంగళవారం మద్యాహ్నం 3 గంటల నుంచి మృతుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉందని, గత రెండుమూడు రోజుల క్రితమే ఆసుపత్రి నుండి ఇంటికొచ్చామన్నారు.

మృతుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చుట్టుప్రక్కల వెతికిన కుటుంబ సభ్యులు, స్నేహితులు బుదవారం ఉదయాన్నే పెద్దయల్లకుంట్ల సమీపంలో చింతచెట్టుకు ఉరివేసుకునిఉన్నట్లు ఆటుగా వెళ్తున్నవారు తెలియజేయడంతో వెళ్ళి చూడగా గంగాధర్ అని తెలుసు కొని పోలీసులకు సమాచారం అందిచారు.

సమాచారం అందిన వెంటనే పోలీసూలు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story