Court Verdict: పెళ్ళైన పురుషుడు వేరే మహిళతో సహజీవనం తప్పు కాదు.. కోర్టు సంచలనం తీర్పు

Court Verdict: పెళ్ళైన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదంటూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

KVD Varma
Published on: 27 March 2026 4:53 PM IST
Court Verdict: పెళ్ళైన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదంటూ
X

Court Verdict

Court Verdict: వివాహితుడైన పురుషుడు ఒక మహిళతో సహజీవనం చేయడం చట్టరీత్యా నేరం కాదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది . అతను వివాహితుడని తెలిసినప్పటికీ, ఒక మహిళ అతనితో సహజీవనం చేయడంలో తప్పులేదని కోర్టు చెప్పింది. పెళ్ళైన వ్యక్తితో సహజీవనం చేస్తున్న మహిళకు కుటుంబం నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. దీనిపై ఆ మహిళ తమకు రక్షణ కల్పించాలని పిటిషన్ వేసింది. ఈ కేసును విచారించిన కోర్టు, వివాహితుడైన పురుషుడు వయోజనురాలైన మహిళతో పరస్పర అంగీకారంతో కలిసి జీవించడం నేరం కాదని స్పష్టం చేసింది.

కోర్టు ఏం చెప్పిందంటే..

"వివాహితుడైన పురుషుడు ఒక మహిళ సమ్మతితో సహజీవనం చేయడం శిక్షార్హమైన నేరం కాదు. నైతికతను, చట్టాన్ని వేరుగా ఉంచాలి. అందువల్ల, చట్టరీత్యా అది నేరం కానంత మాత్రాన, సామాజికంగా సరైనది అని చెప్పలేము," అని ధర్మాసనం పేర్కొంది. 'నైతికత'ను, చట్టాన్ని వేరుగా చూడాలని కోర్టు పేర్కొంది. సహజీవనం చేస్తున్న వివాహితుడు ఎలాంటి నేరం చేయలేదు. వయోజనురాలైన మహిళతో అతని సహజీవనం పరస్పర అంగీకారంతోనే ఉన్నట్లు కనిపిస్తోందని కోర్టు తెలిపింది.

అరెస్ట్ వద్దు..

పిటిషనర్ దంపతులను అరెస్టు చేయవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది. మహిళా పిటిషనర్ కుటుంబ సభ్యులెవరూ కూడా ఆ దంపతులకు హాని కలిగించకూడదని కూడా ఆదేశించింది. వారిద్దరి కుటుంబ సభ్యులు వారు నివసిస్తున్న ఇంట్లోకి ప్రవేశించవద్దని, మొబైల్ ద్వారా గానీ లేదా మూడవ వ్యక్తి ద్వారా గానీ వారిని నేరుగా సంప్రదించడానికి ప్రయత్నించవద్దని కూడా ఆదేశించింది. పిటిషనర్ల భద్రత, రక్షణకు స్థానిక పోలీస్ చీఫ్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాలని కోర్టు పేర్కొంది.

అసలేమైందంటే..

అప్పటికే పెళ్ళైన నేత్ర పాల్ అనే వ్యక్తి అనామిక అనే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. జనవరి 8న, అనామిక తల్లి కాంతి షాజహాన్‌పూర్‌లోని జైతీపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసింది. నేత్ర పాల్ తమ కూతురిని తమ దగ్గరకు పంపించడం లేదని చెప్పింది. అతనికి అప్పటికే పెళ్లయిందని.. అయినా అతను మోసం చేసి అనామికతో కలిసి జీవిస్తున్నాడని ఆమె ఆరోపించింది. అనామిక వయసు కేవలం 18 ఏళ్ళేనని, పెళ్ళైన వ్యక్తితో ఆమె సంబంధంలో ఉండటం తనకు ఇష్టం లేదని ఆమె తల్లి తన ఫిర్యాదులో పేర్కొంది.

ఈ నేపథ్యంలో, అనామిక -నేత్ర పాల్ అలహాబాద్ హైకోర్టులో కేసును సవాలు చేసి, దానిని కొట్టివేయాలని కోరుతూ కోర్టు నుండి రక్షణ కోరారు. నాకు 18 ఏళ్లు దాటాయి. నా కుటుంబం నుండి పరువు హత్య భయాన్ని ఎదుర్కొంటున్నాను. నన్ను రక్షించండి అంటూ కోర్టును వేసుకోండి. దీంతో విచారణ జరిపిన కోర్టు పై తీర్పు ఇచ్చింది.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story