Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం!

Kerala: కేరళ త్రిసూర్ జిల్లాలో నిలిపివున్న లారీని కారు ఢీకొట్టిన ఘోర ప్రమాదం. తమిళనాడుకు చెందిన 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Sept 2026 11:15 AM IST
Kerala
X

Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం!

Kerala: కేరళలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. త్రిసూర్‌ జిల్లాలో ఆగివున్న లారీని వేగంగా దూసుకువచ్చిన కారు. వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులంతా తమిళనాడుకు చెందినవారుగా తెలుస్తోంది. దిండిగల్‌లోని PSNA ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. మృతదేహాలను త్రిస్సూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించినట్టు సమాచారం. గురువాయూర్ నుంచి కొడుంగల్లూరుకు కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా ప్రయాణించడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

శుక్రవారం అర్థరాత్రి కైపమంగళంలోని పనంబిక్కున్ను దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి వాహనంలో ఇరుక్కున్న వారికి బయటకు తీశారు.

ప్రమాదంలో కారు తీవ్రంగా నుజ్జునుజ్జు కావడంతో లోపల చిక్కుకున్న వారిని రక్షించడానికి అధికారులు కారు భాగాలను కట్‌ చేయాల్సి వచ్చింది. అప్పటికే ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

నిర్మాణ పనులు జరుగుతున్న హైవేపై లారీని అక్రమంగా పార్క్ చేయడమే ప్రమదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్న్నారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన ప్రమాద దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story