Kamareddy: అతివేగంతో కారు బీభత్సం యువకుడు మృతి, ఇద్దరికి గాయాలు!
Kamareddy: కామారెడ్డి శిశుమందిర్ చౌరస్తా వద్ద అతివేగంతో వచ్చిన కారు స్కూటీని, మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం, ఇద్దరికి తీవ్ర గాయాలు.
Kamareddy: అతివేగంతో కారు బీభత్సం యువకుడు మృతి, ఇద్దరికి గాయాలు!
Kamareddy: కామారెడ్డిలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలని శిశుమందిర్ చౌరస్తా సమీపంలో అతివేగంతో వచ్చిన కారు ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టింది.
అదే విధంగా రోడ్డు పక్కన ఉన్న మరో కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో స్కూటీ నుజ్జునుజ్జయ్యింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడిక్కే మృతి చెందగా.. మరొ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదానికి కారణమైన కారులో ప్రయాణిస్తున్న మహిళ కూడా గాయపడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాణానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
Next Story




