Minor Girl : స్లీపర్ బస్సులో దారుణం.. బాలికపై డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యం.!
Minor Girl : ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో షాకింగ్ నేరం వెలుగులోకి వచ్చింది. రాత్రి సమయంలో దారి తప్పి ఒంటరిగా ఉన్న ఒక 16 ఏళ్ల మైనర్ అమ్మాయిని నమ్మించి
Greater Noida sleeper bus minor girl assault case
Minor Girl : ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో షాకింగ్ నేరం వెలుగులోకి వచ్చింది. రాత్రి సమయంలో దారి తప్పి ఒంటరిగా ఉన్న ఒక 16 ఏళ్ల మైనర్ అమ్మాయిని నమ్మించి బస్సు ఎక్కించుకున్న డ్రైవర్, కండక్టర్ ఆమెపై రన్నింగ్ బస్సులోనే దారుణంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. ఈ భయానక ఇన్సిడెంట్‌కు సంబంధించి బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్‌తో అలర్ట్ అయిన పోలీసులు, కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
స్టడీస్ విషయంలో గొడవపడి ఇల్లు వదిలి వచ్చి..
బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాకు చెందిన అమ్మాయి. చదువు సరిగ్గా చదవట్లేదని తల్లి మందలించడంతో కోపంతో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వచ్చేసింది. నోయిడా సెక్టర్ 63లో నివసిస్తున్న తన కజిన్ వద్దకు వెళ్లాలని డిసైడ్ అయి బస్సు ఎక్కింది. అయితే ఆగస్టు 4న రాత్రి టైమ్‌లో హెవీ రైన్ పడుతుండటం, చీకటిగా ఉండటంతో రూట్ సరిగ్గా తెలియక ఆ అమ్మాయి పొరపాటున గ్రేటర్ నోయిడాలోని పరిచౌక్ దగ్గర దిగిపోయింది.
ప్యాసింజర్స్ లేని ఖాళీ బస్సు.. హెల్ప్ పేరిట దారుణం..
తాను రాంగ్ ప్లేస్‌లో దిగానని రియలైజ్ అయిన ఆ అమ్మాయి, అక్కడే పార్క్ చేసి ఉన్న ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు డ్రైవర్, కండక్టర్‌ను రూట్ అడిగింది. ఆ బస్సు సూరజ్‌పూర్ వర్క్‌షాప్‌లో రిపేర్స్ పూర్తి చేసుకుని ప్యాసింజర్స్ ఎవరూ లేకుండా ఖాళీగా వస్తోంది. ఆ అమ్మాయి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన కండక్టర్, బస్సు నోయిడా సెక్టర్ 63 వైపే వెళ్తోందని అబద్ధం చెప్పి ఆమెను లోపలికి ఎక్కించుకున్నాడు. బస్సు స్టార్ట్ అయిన కొద్దిసేపటికే కండక్టర్ మిస్‌బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ కలసి ఆ అమ్మాయిపై లైంగిక దాడి చేశారు. ఆ టైమ్‌లో ఆమె కేకలు వేయడానికి ట్రై చేయగా, ఎదురు తిరిగితే స్పాట్‌లోనే చంపేస్తామని బెదిరించారు.
ఢిల్లీలో వదిలేసి ఎస్కేప్.. నిమిషాల్లో ఛేదించిన పోలీసులు
తర్వాత నిందితులు ఆ అమ్మాయిని ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ రింగ్ రోడ్డు ఏరియాలో వదిలేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. షాక్ నుంచి తేరుకున్న ఆ అమ్మాయి వెంటనే దగ్గర్లోని పోలీసులను కాంటాక్ట్ చేసి జరిగిన ఇన్సిడెంట్ చెప్పింది. ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిహారిక భట్ తెలిపిన వివరాల ప్రకారం, కంప్లైంట్ రాగానే సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసి తిమార్పూర్ పార్కింగ్ ఏరియాలో దాక్కున్న డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌లను అరెస్ట్ చేశారు. క్రైమ్ జరిగిన బస్సును సీజ్ చేసిన ఫోరెన్సిక్ టీమ్, బస్సు లోపల కర్టెన్స్ దగ్గర ఉన్న గర్ల్ హెయిర్ శాంపిల్స్ , సీసీటీవీ ఫుటేజ్ సేకరించింది.
జుడీషియల్ కస్టడీకి నిందితులు
నిందితులు ఇద్దరిపై గ్యాంగ్ రేప్, కిడ్నాపింగ్, అసాల్ట్ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. జడ్జి వారికి జుడీషియల్ కస్టడీ విధిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. కాగా, ప్రాపర్ కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) అధికారులు ఆ అమ్మాయిని సేఫ్‌గా ఆమె పేరెంట్స్‌కి అప్పగించారు. మూవింగ్ బస్సులో జరిగిన ఈ దారుణ ఇన్సిడెంట్ నగరంలో ఉమెన్ సెక్యూరిటీపై మళ్లీ అనేక ప్రశ్నలను రేకెత్తించింది.




