Pargi: పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం కారులో మంటలు చెలరేగి ఒకరు మృతి!
Pargi: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. సిమెంట్ ట్యాంకర్ కారును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు.
Pargi: పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం కారులో మంటలు చెలరేగి ఒకరు మృతి!
Pargi: పరిగి మండలం గడిసింగాపూర్ – చింతలచెరువు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కొడంగల్ వైపు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ కారును ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన ఘటన అనంతరం కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని కారులో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




