Eluru: వేలేరుపాడు ఆశ్రమ పాఠశాలలో విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి

Eluru: ఏలూరు జిల్లా వేలేరుపాడు గిరిజన ఆశ్రమ పాఠశాలలో కిటికీ వద్ద బట్టలు ఆరేస్తూ విద్యుత్ షాక్‌తో 8వ తరగతి విద్యార్థిని లక్ష్మీపార్వతి మృతి చెందింది.

BULLA NAGARAJU, KUKUNOOR
Updated on: 7 Aug 2026 12:25 PM IST
Kukunoor
X

Kukunoor: వేలేరుపాడు ఆశ్రమ పాఠశాలలో విద్యుత్ షాక్‌తో విద్యార్థిని మృతి

ఏలూరు జిల్లా: వేలేరుపాడు మండలం శివకాశి పురం గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహంలో 8వ తరగతి చదువుతున్న కెచ్చేల లక్ష్మీపార్వతి అనే విద్యార్థిని శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో హాస్టల్ గదిలోని కిటికీ బట్టల ఆరేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురికావడంతో పక్కనే ఉన్న సహచర విద్యార్థిని చున్ని ని లక్ష్మీపార్వతి కాలికి వేసి లాగింది. అది గమనించిన గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహం సిబ్బంది విద్యుత్ షాక్ కు గురైన విద్యార్థిని ని హుటాహుటిన వేలేరుపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో ఆసుపత్రికి చేరుకొని

కూతురి మృతదేహం వద్ద బోరున కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు విలిపిస్తుండడంతో ఒక్కసారిగా ఆసుపత్రి ప్రాంగణమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story