Guntakal: గుంతకల్లు కసాపురంలో విషాదం: విద్యుత్ ఘాతంతో రైతు దుర్మరణం!

Guntakal: అనంతపురం జిల్లా కసాపురంలో విద్యుత్ వైరు తగిలి రైతు ఆంజనేయులు మృతి చెందగా, విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 12 Aug 2026 11:19 AM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు కసాపురంలో విషాదం: విద్యుత్ ఘాతంతో రైతు దుర్మరణం!

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో విద్యుత్ ఘాతంతో రైతు బోయ ఆంజనేయులు మృతి చెందిన ఘటన విషాదం నింపింది.

గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు ఉదయం తన పొలంలో కంది సేద్యం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైరు ఆయన ఎద్దుపై పడింది. ఎద్దును కాపాడేందుకు వెళ్లిన ఆంజనేయులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే తమ వాడు బలయ్యాడని ఆరోపించారు. పొలాల వద్ద తెగిపడి ఉన్న వైర్లను సరిచేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story