Madanapalle: నగల కోసం 83 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నగల కోసం 83 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య. మృతదేహాన్ని చెరువులో పాతిపెట్టిన నిందితులను అరెస్ట్ చేయాలని రాస్తారోకో.

Srinivasulu, Madanapalle
Published on: 6 Sept 2026 1:02 PM IST
Madanapalle
X

Madanapalle: నగల కోసం 83 ఏళ్ల వృద్ధురాలి దారుణ హత్య!

Madanapalle: నగలపై కన్నేసిన దుండగులు 83 ఏళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని చెరువులో పాతిపెట్టిన ఘటన మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. కొండామారిపల్లి గ్రామం దేవరెడ్డిగారిపల్లికి చెందిన లేట్ నూలు గంగులప్ప భార్య లక్ష్మీదేవి (83) బైపాస్ రోడ్డులో చిల్లర దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవారు.

ఆమె నగలపై కన్నేసిన నిందితులు ఆగస్టు 26న పథకం ప్రకారం లక్ష్మీదేవిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ములగమూడి చెరువుకు తీసుకెళ్లి పాతిపెట్టారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు శనివారం వడమాలపేట మండలం ములగమూడికి వెళ్లి చెరువులో పాతిపెట్టిన లక్ష్మీదేవి మృతదేహాన్ని వెలికితీయించారు.

అనంతరం అక్కడే స్పాట్ పోస్టుమార్టం నిర్వహించారు. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు మదనపల్లె బైపాస్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. లక్ష్మీదేవిని హత్య చేసిన వినోద్, ప్రమీలతో పాటు మరో యువకుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 83 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేయడానికి నిందితులకు మనసెలా వచ్చిందంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాపనార్థాలు పెట్టారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story