Hyderabad: కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఐదేళ్ల బాలుడు మృతి!
Hyderabad: హైదరాబాద్ మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.
Hyderabad: కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఐదేళ్ల బాలుడు మృతి!
Hyderabad: కారు ఢీకొట్టడంతో ఐదేళ్ల బాలుడు మృతి.
హైదరాబాద్ కమిషనరేట్ మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన.
స్థానికులు పోలీసులు తెలిపిన విరాల ప్రకారం... ప్రగతి కాలనీ ప్రాంతానికి చెందిన సూర్యనారాయణ మంగమ్మ మేస్త్రి పని చేస్తుంటారు.
వీరి కుమారుడు దుర్గ ప్రసాద్[5] మంగళవారం సాయంత్రం కాలనీలో ఆడుకుంటున్నాడు.
అదే కాలనీకి చెందిన ఓ మహిళ కారు నడిపిస్తూ బాలుడిని ఢీ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story




