Madanapalle: దగా డీఎస్సీ కి వ్యతిరేకంగా ఈ నెల 29న భారీ నిరసన
Madanapalle: కూటమి ప్రభుత్వం ప్రకటించిన "దగా డీఎస్సీ"కి వ్యతిరేకంగా మదనపల్లెలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం భారీ నిరసన.
Madanapalle: దగా డీఎస్సీ కి వ్యతిరేకంగా ఈ నెల 29న భారీ నిరసన
మదనపల్లె: గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వై. స్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన “దగా డీఎస్సీ”కి వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ అభి వర్షిత్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రంగా ఈ భారీ నిరసన కార్యక్రమం ఈ నెల 29వ తేదీ (శుక్రవారం) ఉదయం 9:30 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపిస్తూ చేపట్టనున్న ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల కమిటీ నాయకులు, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని పోరాటాన్ని జయప్రదం చేయాలని అభి వర్షిత్ రెడ్డి పిలుపునిచ్చారు.




