Madanapalle: దేశాయ్ తిప్పారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ సమావేశం
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశం జరిగింది.
Madanapalle: దేశాయ్ తిప్పారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ సమావేశం
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి స్వగృహంలో ఆదివారం వైఎస్సార్సీపీ కీలక నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వైఎస్సార్సీపీ రాయలసీమ రీజనల్ కో-ఆర్డినేటర్, పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డికి డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణ, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల్లోకి మరింత చేరువ కావాలని, పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.
అనంతరం సతీష్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో వలసపల్లి నాగరాజా రెడ్డి, తట్టి నాగరాజా రెడ్డి, కోటరపల్లి రాజా, మస్తాన్ రెడ్డి, నల్లచెరువు భాష, శ్రీనాథ్ రెడ్డి తదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




