Madanapalle: మదనపల్లెలో నూతన దంపతులను ఆశీర్వదించిన వైసీపీ నేతలు

Madanapalle: మదనపల్లె చౌడేశ్వరి కళ్యాణ మండపంలో వైసీపీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది.

Srinivasulu, Madanapalle
Published on: 26 Aug 2026 10:35 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో నూతన దంపతులను ఆశీర్వదించిన వైసీపీ నేతలు

మదనపల్లె: రింగ్ రోడ్డు సమీపంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో వైసీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి కుమారుడి వివాహాన్ని పురస్కరించుకుని షాలిని–సాయి చరణ్ రెడ్డి రిసెప్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదనపల్లె నియోజకవర్గ వైసీపీ సమన్వయ కార్యకర్త నిస్సార్ అహ్మద్, నిమ్మలపల్లి శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ యువ నాయకులు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్, హర్షవర్ధన్ రెడ్డి నవ వధూవరులను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్ వేడుకల్లో రామ్మోహన్ రెడ్డి, గారబురుజు బాబు, రామారావు, ఉదయ్ శేఖర్ రెడ్డి, భాస్కర్,

అశోక్ రాయల్, రాజు, హరి, అలోక్, గణి, తదితర వైసీపీ సీనియర్ నాయకులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వైసీపీ నాయకులు, కార్యకర్తల సందడితో రిసెప్షన్ వేడుకలు ఘనంగా జరిగాయి.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story