Madanapalle: దేశాయ్ తిప్పారెడ్డి రాజకీయ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం!
Madanapalle: మదనపల్లెలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Madanapalle: దేశాయ్ తిప్పారెడ్డి రాజకీయ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం!
మదనపల్లె, జూలై 9: వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి జన్మదిన సందర్భంగా మదనపల్లెలో నిర్వహించిన వేడుకల్లో వైసీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) పాల్గొని ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ప్రజలకు అంకితభావంతో సేవలందించిన నాయకుడని కొనియాడారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయన రాజకీయ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
భగవంతుని ఆశీస్సులతో దేశాయ్ తిప్పారెడ్డి సంపూర్ణ ఆయురారోగ్యాలతో, ఆనందంగా మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




