Chittoor: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి: మాజీ మంత్రి!

Chittoor: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పూతలపట్టు నియోజకవర్గం యాదమరిలో వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు చేపట్టింది.

VASU, PUTTALAPATTU
Published on: 7 Aug 2026 4:16 PM IST
Chittoor
X

Chittoor: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి: మాజీ మంత్రి!

చిత్తూర్: వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సంయుక్తంగా అన్నారు.

డీఎస్సీ అక్రమాల పైన, ప్రజలకు ఇచ్చిన హామీల పైన కూటమి ప్రభుత్వం జవాబు దారి తనం కోల్పోయిందని పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలో పూతలపట్టు వైఎస్ఆర్సిపి మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, తిరుపతి చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించలేదని, అలాగే మెగా డీఎస్సీ ద్వారా అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చి, డీఎస్సీలో అర్హత సాధించిన వారికి ఉద్యోగాలు కల్పించకుండా వారిని కూటమి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు.

కూటమి ప్రభుత్వానికి సహకరించిన వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారన్నారు. గతంలో దివంగత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేయించి తన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదని నిరూపించి నిజాయితీని చాటుకున్నారని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పై సిబిఐ దర్యాప్తు చేయించి నిజాయితీ చాటుకోవాలన్నారు.

అనంతరం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రీడలలో పాల్గొనకుండా ఎలాంటి అర్హత లేకుండా పోయిన, క్రీడాకోటాలో అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల డీఎస్సీ బాధితులకు వైయస్సార్సీపి పార్టీ అండగా నిలిచి న్యాయం జరిగేంతవరకు దశలవారీగా పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల కన్వీనర్లు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story