Mulakalacheruvu: జగన్నాథ్ రెడ్డి పెద్దకర్మలో వైఎస్సార్సీపీ నేతల నివాళులు
Mulakalacheruvu: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి తండ్రి జగన్నాథ్ రెడ్డి పెద్దకర్మకు నిసార్ అహ్మద్, హర్షవర్ధన్ రెడ్డి హాజరై నివాళులర్పించారు.
Mulakalacheruvu: జగన్నాథ్ రెడ్డి పెద్దకర్మలో వైఎస్సార్సీపీ నేతల నివాళులు
ములకలచెరువు, ఆగస్టు 1: తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం మద్దినాయుడుపల్లి గ్రామంలోని సి. మలిగివారిపల్లిలో మదనపల్లె మండల వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు వి. శ్రీకాంత్ రెడ్డి తండ్రి వి. జగన్నాథ్ రెడ్డి పెద్దకర్మ కార్యక్రమం శనివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మదనపల్లె నియోజకవర్గ వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) హాజరై దివంగత జగన్నాథ్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీకాంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పూజారి చరణ్, మిలిటరీ మల్లికార్జున్ రెడ్డి, కొత్తపల్లి మహేష్, జబీవుల, తట్టి హరి, మాజీ సర్పంచ్ భయ్యా రెడ్డి, ఈశ్వర్ నాయక్ తదితరులు పాల్గొని దివంగత జగన్నాథ్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.




