Madanapalle:తల్లిదండ్రుల ఆందోళనపై వెంటనే స్పందించిన మదనపల్లె ఎమ్మెల్యే

Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల కొరత తీరింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తక్షణమే స్పందించి DEO, MEO లతో మాట్లాడి టీచర్

Srinivasulu, Madanapalle
Published on: 22 July 2026 11:46 AM IST
Madanapalle
X

Madanapalle:తల్లిదండ్రుల ఆందోళనపై వెంటనే స్పందించిన మదనపల్లె ఎమ్మెల్యే

వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుల నియామకం.. ఎమ్మెల్యే షాజహాన్ బాషా చొరవకు తల్లిదండ్రుల ధన్యవాదాలు

మదనపల్లె: పట్టణంలోని 34, 35 వార్డుల పరిధిలోని రామిరెడ్డి లేఔట్‌లో ఉన్న వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌ను 35వ వార్డు ఇన్‌చార్జి రమేష్ రెడ్డి, 34వ వార్డు ఇన్‌చార్జి బాలమల్లి శేఖర్ సందర్శించారు.

ఈ సందర్భంగా పాఠశాల హెడ్‌మాస్టర్‌తో మాట్లాడి విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు అందుతున్నాయా లేదా అనే అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇదే సమయంలో పాఠశాలలో హిందీ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న వార్డు ఇన్‌చార్జిలు వెంటనే స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు సమాచారం అందించారు.

ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పందించి ఫోన్ ద్వారా డీఈఓ, ఎంఈఓలతో మాట్లాడి వెంటనే హిందీ ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుల నియామకం జరగడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వారకనాథ్ భాస్కర జనార్ధన అమర కార్యకర్తలు పాల్గొన్నారు

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story