Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు!

Srikalahasti: శ్రీకాళహస్తిలో ఈ నెల 17న విశ్వకర్మ జయంతి వేడుకలు.. అభిషేకం, అన్నదానం మరియు వీరబ్రహ్మేంద్రస్వామి ఊరేగింపు ఏర్పాట్లు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 15 Sept 2026 12:49 PM IST
Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు!

Srikalahasti: పిచ్చాటూరు రోడ్డులోని శ్రీ మద్విరాట్ విశ్వకర్మ ఆలయంలో 17వ తేదిన విశ్వకర్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు ఆలయంలో విశేష అభిషేకం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అనంతరం మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల్లో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఊరేగింపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ వివరాలను విశ్వబ్రాహ్మణ కమిటీ సభ్యులు పుల్లూరు మోహన ఆచారి తెలిపారు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI