Ramasamudram: ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా పనిచేయాలి: రామసముద్రం ఎంపీపీ

Ramasamudram: రామసముద్రం మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ఎంపీపీ వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 6 July 2026 3:48 PM IST
Ramasamudram
X

Ramasamudram: ప్రతి బీఎల్‌ఓ బాధ్యతాయుతంగా పనిచేయాలి: రామసముద్రం ఎంపీపీ

రామసముద్రం, జూలై 6: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా రామసముద్రం మండల ఎంపీపీ వెంకటరమణారెడ్డి సోమవారం అకస్మాత్తుగా ఉలపాడు పంచాయతీ గ్రామ సచివాలయంతో పాటు చొక్కాడ్లపల్లి గ్రామ సచివాలయ పరిధిలోని చొక్కాడ్లపల్లి, పురాండ్లపల్లె, కేసీపల్లె గ్రామాల్లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, ప్రతి బీఎల్‌ఓ తన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ప్రభుత్వం అందజేసిన గణన పత్రాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్‌ఓలకు అందించాలని కోరారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు రెడ్డి వీరేగౌడు మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలందరూ చురుకుగా పాల్గొని తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రాధాకృష్ణారెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, శ్రావణ్ కుమార్, బ్రహ్మానందరెడ్డి, బాలాజీ, రంగారెడ్డి, అంజిరెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి, గుంతలపేట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story