Madanapalle: మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి నివాసంలో వరలక్ష్మీ వ్రతం

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురువంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి నివాసంలో వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు.

Srinivasulu, Madanapalle
Published on: 21 Aug 2026 3:55 PM IST
Madanapalle
X

Madanapalle: మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి నివాసంలో వరలక్ష్మీ వ్రతం

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురువంక పంచాయతీ మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి నివాసంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పసుపులేటి చలపతితో పాటు ఆయన భార్య, మాజీ సర్పంచ్ పార్వతి, కుమారుడు శశికుమార్, కోడలు లావణ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరలక్ష్మీ అమ్మవారికి విశేష పూజలు, నైవేద్యాలు సమర్పించి కుటుంబ సభ్యులు భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని నిర్వహించారు.

మదనపల్లె ప్రజలు, కురువంక గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకునే పవిత్రమైన పండుగ అని అన్నారు. మదనపల్లె ప్రజలతో పాటు కురువంక గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రతి కుటుంబంలో సిరిసంపదలు, ఆనందం నిండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

గ్రామంలో ఐక్యత, ప్రశాంతత నెలకొని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story