Madanapalle: మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.. పర్యావరణ పరిరక్షణకు పిలుపు.
Madanapalle: మదనపల్లెలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ!
Madanapalle: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి ప్రజలకు సూచించారు. కడప కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె రెడ్డెప్ప నాయుడు కాలనీలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి హాజరై ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజమైన మట్టితో, సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు జరుగుతుందని తెలిపారు.
పీఓపీ విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ సుధా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




