Chittoor: చిత్తూరు జిల్లాలో 'ద బ్రెయిన్' సినిమా షూటింగ్

Chittoor: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎర్రచెరువుపల్లిలో 'ద బ్రెయిన్' మూవీ షూటింగ్. హీరో అజయ్, ఇతర నటీనటులు పాల్గొన్న మీడియా సమావేశం.

VASU, PUTTALAPATTU
Published on: 5 Aug 2026 4:32 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు జిల్లాలో 'ద బ్రెయిన్' సినిమా షూటింగ్

చిత్తూరు: చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలం, ఎర్ర చెరువుపల్లి గ్రామమునందు బ్రెయిన్ సినిమా కోసం ప్రత్యేకంగా వైద్యశాలను ఏర్పాటుచేసి హీరో అజయ్, రోగులను పరీక్ష చేసే సన్నివేశాలను డైరెక్టర్ అశ్విన్ కామరాజ చిత్రీకరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో హీరో అజయ్ మాట్లాడుతూ మానవ జీవితంలో, భార్యాభర్తల బంధాలు, అత్తా కోడళ్ళ బంధాలు, అన్నా చెల్లి బంధాలు, స్నేహ బంధాలు మారుతున్న కాలానికి అనుగుణంగా క్షీణించాయి అన్నారు.

ది బ్రెయిన్ సినిమా ద్వారా సమాజంలో మార్పు కొరకు కొంతమేరకైనా ప్రయత్నం చేస్తామని ఈ చిత్రంలో నటించడం జరిగిందని హీరో అజయ్ తెలిపారు. సినిమా కథ, మాటలు రాసిన ఉమా మాట్లాడుతూ పూర్వకాలంలో భర్తను దైవముగా భావించేవారు రాను రాను కాలానగునముగా సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకున్న నేపద్యంలో ద బ్రెయిన్ సినిమా ద్వారా భార్యాభర్తల బంధానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో ఈ సినిమా తీస్తున్నామని ఆయన అన్నారు.

ఈ చిత్రంలో హీరో అజయ్ తో పాటు, హీరోయిన్స్ గా సారిక, దివ్య, తన్విక నటిస్తున్నారు. ముఖ్య పాత్రలో పోలీస్ ఆఫీసరు గా కాజూరు బాలాజీ, ప్రతి నాయకుడు పాత్రలు ప్రముఖ నటుడు అజయ్ గోష్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు అశేషంగా వచ్చారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU

Next Story