Madanapalle: మదనపల్లెలో వైకుంఠ సమారాధన.. నివాళులర్పించిన శ్రీరామ్ చినబాబు

Madanapalle: మదనపల్లెలో ఘనంగా జరిగిన యల్లంపల్లి సూర్యప్రకాష్ వైకుంఠ సమారాధన. హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు.

Srinivasulu, Madanapalle
Published on: 7 Jun 2026 4:58 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో వైకుంఠ సమారాధన.. నివాళులర్పించిన శ్రీరామ్ చినబాబు

మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని స్థానిక ఆర్య వైశ్య హాస్టల్‌లో నిర్వహించిన యల్లంపల్లి సూర్యప్రకాష్ వైకుంఠ సమారాధన కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు పాల్గొన్నారు.

బీజేపీ నాయకుడు యల్లంపల్లి ప్రశాంత్ తండ్రి యల్లంపల్లి సూర్యప్రకాష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ, యల్లంపల్లి సూర్యప్రకాష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో దేవత స్టోర్స్ అధినేత సతీష్, తెలుగు యువత నాయకుడు మహబూబ్ ఖాన్, బీజేపీ యువ నాయకుడు శ్రీకాంత్‌తో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు పాల్గొని యల్లంపల్లి సూర్యప్రకాష్‌కు ఘనంగా నివాళులర్పించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story