Kuppam: ఖబడ్దార్ పెద్దిరెడ్డి.. కుప్పంలో అడుగుపెడితే అడ్డుకుంటాం: టీడీపీ నేతలు

Kuppam: కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగుపెడితే అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించారు. కుప్పంలో వైసీపీ అలజడులు సృష్టిస్తే సహించబోమని స్పష్టం చేశారు.

KUMAR, KUPPAM
Published on: 7 Sept 2026 2:47 PM IST
Kuppam
X

Kuppam: ఖబడ్దార్ పెద్దిరెడ్డి.. కుప్పంలో అడుగుపెడితే అడ్డుకుంటాం: టీడీపీ నేతలు

చిత్తూరు జిల్లా: కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, రెస్కో చైర్మన్ ప్రతాప్, ఏఏంసి చైర్మన్ జీఎం రాజు.. నైతిక విలువలతో రాజకీయాలు చేసే నియోజకవర్గం కుప్పం కేవలం రాజకీయాల కోసం కుప్పంలో ఫ్యాక్షన్ కల్చర్ ను తీసుకొచ్చిన పార్టీ వైసీపీ.

వైసీపీ హయంలో దౌర్జన్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు బయట వ్యక్తులను కుప్పంకు తీసుకువచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశారు. గత మున్సిపల్ ఎన్నికల్లో దొంగ ఓట్లు సృష్టించి, కుప్పం మున్సిపాలిటీని లాక్కున్నారు.

కేవలం 5 వేల ఓట్లతో పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైసీపీ గూండాలను రెచ్చగొట్టడానికి కుప్పంకు పెద్దిరెడ్డి వస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ హక్కుతో కుప్పానికి వస్తున్నారు.ఎమ్మెల్యే హోదాలో పుంగనూరును మాత్రమే పెద్దిరెడ్డి చూసుకోవాలి.

ఎన్నికల కోసం కుప్పంలో అలజడి సృష్టిస్తే ఊరుకునేది లేదు గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తన నియోజకవర్గంలో రాకుండా అడ్డుకున్నారు.

గత వైసీపీ హయంలో చేసిన బిభత్సలాను ప్రజలు మరచిపోలేదు గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకోవాలని దౌర్జన్యం చేశారు. కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేస్తామని వైసీపీ నాయకులు బీరాలు పలికారు. ఎన్నికల్లో మాత్రం రాజకీయం చేస్తాం, కుప్పంను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు.

కుప్పంలో పుంగనూరు, పులివెందుల సంస్కృతి చేయాలని వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారు. సీఎం చంద్రబాబు కుప్పంలో అభివృద్ధి పనులు చేయాలని చూస్తుంటే, కుప్పంలో అలజడి సృష్టించాలని వైసిపి నాయకులు చేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డికి మొగుడిని తీసుకొచ్చి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో జగన్ వచ్చి క్యాన్వాస్ చేసినా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయం.

KUMAR, KUPPAM

KUMAR, KUPPAM

Next Story