Madanapalle: కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ వేడుకలు!

Madanapalle: కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లెలో ఎమ్మెల్యే షాజహాన్ భాషాతో కలిసి టీడీపీ నేత డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 29 July 2026 9:33 AM IST
Madanapalle
X

Madanapalle: కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ వేడుకలు!

Madanapalle: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో గౌరవ మదనపల్లె శాసనసభ్యులు ఎం. షాజహాన్ భాషాతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కురుబ–కురమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్లె రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.

సంక్షేమ పథకాలను పారదర్శకంగా అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషాతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story