Punganagar: ప్రజల సమస్యలపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి: టీడీపీ నేత

Punganagar: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నాయకుడు మాదిరాజు లక్ష్మణరాజు (పతిరాజు) చౌడేపల్లి పరిపాలన భవనంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

MAHESH, PUNGANOOR
Published on: 3 Aug 2026 5:41 PM IST
Punganagar
X

Punganagar: ప్రజల సమస్యలపై అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి: టీడీపీ నేత

పుంగనూరు: మండల అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాదిరాజు లక్ష్మణ రాజు( పతి రాజు) కోరారు సోమవారం మండల కేంద్రమైన చౌడేపల్లిలోని పరిపాలన భవనంలో అధికారులతో ఆయన సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత దాహార్తిని తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు కార్యాలయాలకు సమస్యలు పరిష్కరించాలని వచ్చే ప్రజలకు స్నేహభావంతో మెలగి వారి సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.

ముఖ్యంగా రెవెన్యూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు అనంతరం మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు అదేవిధంగా సమస్యలపై చర్చించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పగడాల హరి రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కృష్ణారెడ్డి కార్తీక్ కార్తీక్ వెంకటరెడ్డి డాక్టర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR

Next Story