Thamballapalle: టీడీపీ నేత మానవత్వం.. కార్యకర్త కుటుంబానికి భరోసా!
Thamballapalle: కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న టీడీపీ క్రియాశీల కార్యకర్త అక్బర్ భాషాకు పార్టీ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు రూ.20,000 ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.
Thamballapalle: టీడీపీ నేత మానవత్వం.. కార్యకర్త కుటుంబానికి భరోసా!
తంబళ్లపల్లి, ఆగస్టు 3: తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కలిచర్ల గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ క్రియాశీల కార్యకర్త అక్బర్ భాషా అనారోగ్యంతో బాధపడుతుండగా, ఆయనకు టీడీపీ నాయకుడు కట్టా దొరస్వామి నాయుడు అండగా నిలిచారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో సేవలందిస్తున్న అక్బర్ భాషా ప్రస్తుతం కిడ్నీ ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్నారు.
కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో వైద్య ఖర్చులు భరించడం కష్టంగా మారిన విషయం తెలుసుకున్న కట్టా దొరస్వామి నాయుడు వెంటనే స్పందించి, వైద్య చికిత్స నిమిత్తం రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కట్టా దొరస్వామి నాయుడు మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం తమ బాధ్యత అని అన్నారు. ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ నాయకులు, శ్రేణులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కట్టా దొరస్వామి నాయుడు అందించిన రూ.20,000 ఆర్థిక సహాయానికి అక్బర్ భాషా కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




