రాచమల్లు భూకబ్జాలు, బెట్టింగ్‌లపై ఆధారాలతో వస్తా.. నువ్వు సిద్ధమా? - టీడీపీ నేత మహేష్ నాయుడు

టీడీపీ నేత చప్పిడి మహేష్ నాయుడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు బహిరంగ సవాల్ విసిరారు. తనపై ఉన్న కేసులు వైఎస్సార్ హయాంలో పెట్టినవేనని, రాచమల్లు అవినీతి మరియు భూకబ్జాలపై తానేంటో నిరూపిస్తానని స్పష్టం చేశారు.

C. RAMESH BABU, ROYCHOTI
Published on: 7 May 2026 7:29 PM IST
రాచమల్లు భూకబ్జాలు, బెట్టింగ్‌లపై ఆధారాలతో వస్తా.. నువ్వు సిద్ధమా? - టీడీపీ నేత మహేష్ నాయుడు
X

కడప: నన్ను ప్రొద్దుటూరుకు రమ్మంటావా లేక నువ్వే కడపకు వస్తావా అంటూ ప్రొద్దుటూరు వైసిపి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కడప జిల్లా సుండుపల్లి చెందిన టిడిపి మాజీ రాష్ట్ర కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు సవాల్ విసిరారు. ఎర్రచందనం స్మగ్లర్ అని అనేక కేసులలో నేరస్థడి గా ఉన్న వ్యక్తులు టిడిపి పార్టీలో ఉన్నారంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. తనకు ఉన్న ప్రజా బలాన్ని ఓర్వలేక మీ దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ఎర్రచందన స్మగ్లర్ గా చిత్రీకరించి ఆనేక కేసులు బనాయించి బ్యాన్ లో ఉన్న పీడీ యాక్ట్ తో పాటు ఎన్కౌంటర్ ఆర్డర్స్ జారీ చేయించారన్నారు. తాను నేరస్తులు అయితే వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాపై ఎందుకు చర్య తీసుకోలేక పోయారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కి సూటిగా ప్రశ్నించారు.

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ,అతని బామ్మర్ది అయిన బంగారు రెడ్డి బీసీ వర్గానికి చెందిన టిడిపి కార్యకర్త సుబ్బయ్య ను హత్య చేయించలేదన్నారు. చవటపల్లి వద్ద ఎస్సీ భూములను, సంజీవయ్య కాలనీలో పేదల భూములను కొట్టేసిన ఘనత నీది కాదా ? అంటూ ప్రశ్నించారు. జగనన్న కాలనీ పేరుతో పేదల దగ్గర తక్కువ ధరకే భూములను కొనుగోలు చేసి ప్రభుత్వానికి సుమారు 70 కోట్ల మేర అమ్మి అవినీతికి పాల్పడలేదా ? అంటూ ఎద్దేవా చేశారు. బాధ్యతాయుత ప్రజా సేవలో ఉంటూ క్రికెట్ మ్యాచ్ లకు బెట్టింగ్స్ ఆడిన నీచ సంస్కృతి నీదే కాదా అన్నారు.దేశంలో అతిపెద్ద నేరగాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు ఏ స్వాతంత్ర పోరాటం కోసం జైలుకు పోయాడో చెప్పగలవా? శివ ప్రసాద్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అవినీతిలో కూరుకుపోయిన నాయకులు చిత్తూరుకు చెందిన విజయానంద రెడ్డికి ఎమ్మెల్యే టికెట్, ప్రొద్దుటూరు కు చెందిన రసపుత్ర రజనీని రాష్ట్ర బొంగలి కార్పొరేషన్ డైరెక్టర్ గా,యర్రావారి పాలెం కు చెందిన చంగల్ రెడ్డిని ఎంపీపీగా, మండల కన్వీనర్ గా ఇలా 90% క్రిమినల్స్ ను నియమించలేదా అని ప్రశ్నించారు. తనను, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు.

C. RAMESH BABU, ROYCHOTI

C. RAMESH BABU, ROYCHOTI

Next Story